కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను అకస్మిక తనిఖీ చేసిన శాసనసభ్యులు.


కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను అకస్మిక తనిఖీ చేసిన శాసనసభ్యులు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోకరెడ్డి రాచర్ల మండలంలో ఉన్న కాస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను అకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అక్కడ ఉండి ప్రతి విషయాన్ని పరిశీలించి మధ్యాహ్నం విద్యార్దినులతో కలిసి భోజనం చేయడం జరిగింది. విద్యార్దినులతో ప్రత్యేకంగా కలిసి మాట్లాడడం జరిగింది.

ఈ కాస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరుగుతున్న అక్రమాల గురించి తీవ్ర అసంతృప్తి తెలియ పరచినారు.

ఈ బాలికల విద్యాలయంలో 215 మంది బాలికలు ఉన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టిన దాఖలాలు లేవు. జూన్ 13వ తారీఖున స్కూల్స్ ఓపెన్ అయ్యాక ఈ నెలరోజుల కాలంలో ఇప్పటి ఒక రోజు మాత్రమే కోడి గుడ్డు ఇవ్వడం జరిగింది అంట. 215 మంది విద్యార్దినుల కు రోజు 200 గ్రాముల ప్రకారం పాలు ఇవ్వాల్చి ఉండగా ఇంత వరకు పాలు ఇచ్చిన దాఖలాలు లేవంట. ఎమ్మెల్యే వచ్చారు అని అప్పటి కప్పుడు నాలుగు లీటర్ల పెరుగు తెచ్చి పెట్టారంట.

 పాలు అసలు ఇవ్వరంట ప్రతి రోజు దాదాపుగా 43 లీటర్ల పాలు అవసరం. ఒక రోజుకు పాల మీద ఎంత డబ్బులు నొక్కేస్తున్నట్లు ప్రతి విద్యార్థినికి పాత మెనూ ప్రకారమే అనుకొన్న 200 మిల్లీ గ్రాముల పాలు ఇవ్వాలి. ప్రతి 5 మంది విద్యార్దినులకు ఒక లీటర్ పాలు ఇవ్వాలి 215 మంది విద్యార్దినులకు 43లీటర్ల పాలు ప్రతి రోజు అవసరం అవుతుంది. కాని ఇక్కడ వేడి నీళ్ళల్లో హార్లిక్స్ కలిపి ఇస్తున్నారంట. ఇలాంటి అక్రమాలు బారత దేశంలోనే జరిగి ఉండక పోవచ్చు. 215 మంది విద్యార్దినులకు మధ్యాహ్నం భోజనం లో పప్పు చారు కు మూడున్నర్ర కిలోల కంది బ్యాల్లు వాడినారు ఈ రోజు. ఈ విషయాన్ని వంట మనిషే స్వయంగా చెప్పడం విశేషం. 215 మంది విద్యార్దినులకి గాను రోజుకు 15 కిలోల కంది పప్పు అవసరం అవుతుంది. విద్యార్దినులకు ప్రభుత్వం ప్రతినెలా పంపిణీ చేసే వస్తువులను కూడా ఇచ్చిన దాఖలాలు లేవంట. 

ఈ రోజు మధ్యాహ్నం భోజనం లో పప్పు చారు మంచి నీరులా ఉందంట. అన్నం ఒక సారి మాత్రమే వాళ్ళు ఎంత పెడితే అంతే రెండవ సారి అడిగితే అందరికి పంచిన తరువాత మిగిలితే మాత్రమే పెడుతారంట. ప్రభుత్వ మెనూ ప్రకారం ఇక్కడ విద్యార్దినులకు భోజనం కాని ఇతర అవసరాలు ఇవ్వడం జరుగదు. ఇక్కడ తమ తమ సొంత సామ్రాజ్యం లో తయారు చేసిన మెనూ ప్రకారం అక్కడ అధికారిని అన్ని ఇవ్వడం జరుగుతోంది. ఇక చికెన్ ఎంత తెస్తారో తెలియదు. ఒక టి లేక రెండు ముక్కలు ముష్టి వేసినట్లు వేస్తారంట. ఆంధ్ర ప్రదేశ్ మొత్తం మీద ఇలాంటి అక్రమాలు జరిగి ఉండక పోవచ్చు.

కంది పప్పు మీద చికెన్ మీద ఎంత నొక్కేస్తున్నట్లు?

ఇంకో అద్భుతం ఏంటంటే వంట మనిషి మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడే సాయంత్రానికి కూడా వంట చేస్తారంటఇది కూడా ఒక వింతే కదా. 

ఎమ్మెల్యే విద్యార్దినులతో ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు ఈ విస్తు పోయే నిజాలు బయట పడ్డాయి. అకస్మిక తనిఖీ చేయడం వలన ఈ అక్రమాలు బయట పడ్డాయి. లక్షల రూపాయల అవినీతి పేద విద్యార్దినుల కడుపు కొట్టి సంపాదిస్తున్న ఈ అధికారిణి ని సస్పెండ్ చేయాలా లేక సర్వీస్ నుండి తొలగించి అవినీతి సొమ్మును రికవరీ చేయాలా?

మెనూ ప్రకారం రోజు కోడి గుడ్డు ఇస్తున్నట్లు కూడా ఎంత నొక్కేసి ఉంటారు?స్కూల్ ఓపెన్ చేసాక ఒక సారి మాత్రమే కోడి గుడ్డు ఇవ్వడం జరిగింది.

వంట మనిషి కూడా రాత్రి కి చేయాల్చిన వంట మధ్యాహ్నం తయారు చేసి పెడుతోంది అంటే ఎంత ఘోరంగా ఉందో ఈ కాస్తూర్బ గాంధీ బాలికల విద్యాలయంలోఈ నెల వ్యవదిలో లోనే ఎంత సొమ్ము బొక్కిసారో ?

ప్రతి శనివారం విద్యార్దినుల కడుపు కొట్టి బ్యాగుల్లో నింపి బయటికి ఎవరు తీసుకెళ్తున్నారో దృష్టి పెడితే దొంగలు దొరుకుతారని వినికిడి.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post