యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాలలో యోగ అంశాలపై పోటీ - జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు, జూన్, 6 : జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 7వ తేదీ నుండి 20 వ తేదీ వరకు వివిధ విభాగాలలో అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ చెప్పారు. యోగాసనాల ప్రదర్శన, ప్రాణాయామ, సామూహిక యోగ క్రియ, యోగ పై పాటలు, స్లోగన్లు, వ్యాసరచన, షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ, వీడియో, తదితర విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. ఈనెల 7,8,9 తేదీలలో గ్రామ స్థాయిలో అందరికీ యోగ-ఆరోగ్య ప్రయోజనాలు అంశంపై , 10, 11, 12 వతేదీలలో మండల స్థాయిలో యోగ ద్వారా ఐక్యత -సమాజ అనుసంధానం అంశంపై , ఈనెల 14 నుండి 16 వ తేదీ వరకు జిల్లా స్థాయిలో యోగా మరియు యువత – ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడం అంశంపై పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఈనెల 18 నుండి 20వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపిక కొరకు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోటీలలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన వారు తమకు దగ్గరలోని స్వర్ణ గ్రామ/వార్డ్ సచివాలయాలలో లేదా యోగాంధ్ర యాప్ లో ఏలూరు జిల్లాలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. పోటీలు ఆయా గ్రామాలు, మండలాలలో ప్రభుత్వ పాఠశాలలు, ఆడిటోరియం లు, కమ్యూనిటీ భవనాలు ప్రభుత్వ భవనాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వర్ణ గ్రామ/వార్డ్ సచివాలయాల పరిధిలో ఎక్కువమంది పోటీలలో పాల్గొనేలా సచివాలయాలు సిబ్బంది చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. పోటీలకు సంబంధించి నియమ, నిబంధనలను జిల్లాలోని ప్రతీ స్వర్ణ గ్రామ/వార్డ్ సచివాలయాలు, యోగాంధ్ర యాప్ లో పొందుపరచడం జరిగిందని జేసీ అభిషేక్ గౌడ తెలియజేసారు.
