ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే బాడీబిల్డింగ్‌లో అద్భుత విజయాలు భాను ప్రకాష్.
పట్టుదల ఉంటే సాధారణ ఉద్యోగం చేస్తూనే అసాధారణ విజయాలు సాధించవచ్చని నిరూపించిన ఏలూరు యువకుడు భాను ప్రకాష్.
ఏలూరు జిల్లా.
ఏలూరు ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి జాతీయస్థాయి బాడీబిల్డర్‌గా.
ఏలూరుకు గర్వకారణమైన "బ్రూస్ లీ" భాను ప్రకాష్.
ఒకటే పని చేయడానికి, ఒకేలా బ్రతకడానికి ఇంత పెద్ద బ్రతుకు ఎందుకు?" అనే పెద్ది సినిమా డైలాగ్‌ను నిజం చేస్తూ ఏలూరుకు చెందిన యువకుడు భాను ప్రకాష్ (బ్రూస్ లీ) తన ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.
🔹 జీవనోపాధి కోసం ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే బాడీబిల్డింగ్‌లో అద్భుత విజయాలు సాధిస్తున్నాడు.
* 🔹 ఏలూరు బాడీబిల్డింగ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
🔹 ఇటీవల పంజాబ్‌లో IBBF ఆధ్వర్యంలో నిర్వహించిన National Federation Cup పోటీల్లో 60 కిలోల విభాగంలో పాల్గొని దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో పోటీ పడ్డాడు.
🔹 ఆంధ్రప్రదేశ్ తరఫున కాంస్య పతకం (3వ స్థానం) సాధించి రాష్ట్రానికి, ఏలూరుకు గర్వకారణంగా నిలిచాడు.
🔹 ఈ విజయంతో 2026 నవంబర్‌లో థాయిలాండ్‌లో జరిగే ఆసియా స్థాయి బాడీబిల్డింగ్ పోటీలకు అర్హత సాధించాడు.
జాతీయ సీనియర్ స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో
• 1 బంగారు పతకం
• 1 రజత పతకం
రాష్ట్ర స్థాయి పోటీల్లో
• 7 సార్లు బంగారు పతకాలు
మిస్టర్ వరల్డ్ ఆకుల రాజా నరేంద్ర మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతున్న భాను ప్రకాష్, "పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చు" అనే తన గురువు మాటలను ఆచరణలో చూపిస్తున్నాడు.
తదుపరి లక్ష్యం
2026 నవంబర్‌లో థాయిలాండ్‌లో జరిగే ఆసియా స్థాయి పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని భాను ప్రకాష్ వెల్లడించాడు.
ప్రభుత్వ సహకారం కోరుతూ..
తన ప్రతిభను ప్రభుత్వం, క్రీడా ప్రోత్సాహకులు గుర్తించి ఆర్థికంగా సహకరిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి దేశానికి పేరు తీసుకువస్తానని పేర్కొన్నాడు.
ఇప్పటి వరకు తనకు సహకరించిన గురువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులందరికీ భాను ప్రకాష్ కృతజ్ఞతలు తెలియజేశాడు.
