కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభను విజయవంతం చేయండి: రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ గోన చెన్నకేశవులు పిలుపు
చంద్రగిరి నియోజకవర్గం దామినేడు వద్ద రేపు (శుక్రవారం, 12-06-2026) జరగబోయే కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభను భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎర్రవారిపాలెం మండల పరిశీలకుడు, రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ గోన చెన్నకేశవులు గారు పిలుపునిచ్చారు.గురువారం ఎర్రవారిపాలెం మండలంలో ఏర్పాటు చేసిన కూటమి నాయకుల ముఖ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోన చెన్నకేశవులు మాట్లాడుతూ.. గత రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం అనేక అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని కొనియాడారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల దెబ్బతిన్న రాష్ట్రాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాత్రింబవళ్లు శ్రమిస్తూ మళ్లీ గాడిలో పెడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములవుతూ, దామినేడులో జరిగే ఈ విజయోత్సవ సభకు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు
ఈ సమావేశంలో మండల కూటమి ప్రముఖులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


