పలాస టైక్వాండో క్రీడాకారుల ప్రతిభా పటిమ.. పతకాల పంటతో ఓవరాల్ ఛాంపియన్స్.


 పలాస టైక్వాండో క్రీడాకారుల ప్రతిభా పటిమ.. పతకాల పంటతో ఓవరాల్ ఛాంపియన్స్.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస, జూన్ 8:

శ్రీకాకుళం పట్టణంలోని వైఎస్సార్ మున్సిపల్ కళ్యాణ మండపంలో ఇటీవల నిర్వహించిన సమ్మర్ ఓపెన్ జిల్లా టైక్వాండో లీగ్ పోటీల్లో పలాసకు చెందిన కిషోర్ స్కూల్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి పతకాల వర్షం కురిపించారు. వివిధ విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో జట్టు ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచి పలాసకు గర్వకారణమైంది.

మినీ సబ్ జూనియర్ బాలికల అండర్-16 కేజీల విభాగంలో తన్షి బంగారు పతకం సాధించగా, సబ్ జూనియర్ బాలికల అండర్-41 కేజీల విభాగంలో పి. తన్వి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అండర్-57 కేజీల విభాగంలో ఎం. తేజశ్రీ రజత పతకం సాధించింది.

సబ్ జూనియర్ బాలుర విభాగంలో తెజేశ్వర్ అండర్-23 కేజీల విభాగంలో రజత పతకం గెలుచుకోగా, క్యాడెట్ విభాగంలో రిత్విక్ రెడ్డి అండర్-41 కేజీలలో బంగారు పతకం సాధించాడు. అలాగే లలిత ఆదిత్య అండర్-41 కేజీలలో, యోజిత్ అండర్-44 కేజీలలో, జస్వంత్ అండర్-61 కేజీలలో, మహాలక్ష్మి అండర్-41 కేజీలలో రజత పతకాలు అందుకున్నారు.

ఈ సందర్భంగా క్రీడాకారుల విజయాలను కోచ్ ముడిదాన ఢిల్లేశ్వరరావు అభినందిస్తూ, కఠోర శ్రమ, క్రమశిక్షణతో సాధించిన ఈ విజయాలు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయి పోటీల్లో రాణించేందుకు దోహదపడతాయని తెలిపారు.

జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఓవరాల్ ఛాంపియన్స్‌గా నిలిచిన కిషోర్ స్కూల్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులను చీఫ్ కోచ్ నర్సిపురం శేఖర్ ప్రత్యేకంగా అభినందించి, జాతీయ స్థాయిలో కూడా ఇదే స్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post