27న ముఖ్య మంత్రి పర్యటన సందర్బంగా స్థలాన్ని పరిశీలించిన అధికారులు.


 27న ముఖ్య మంత్రి పర్యటన సందర్బంగా స్థలాన్ని పరిశీలించిన అధికారులు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లె గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంజీవిని డిజిటల్ స ర్వ్ సెంటర్ అరీనా ఈ నెల 27 వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఎంఓ అధికారులు, మార్కాపురం జిల్లా జిల్లా కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, డీస్పీ నాగరాజు , ఆర్ డి ఒ.వెంకట శివరామ్ రెడ్డి మరియు గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్, హెలిపాడ్ ,భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, గ్రామ ప్రజలకు , నీరు, కరెంట్, రవాణా వసతి పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post