ఉద్దానం ప్రజల ఆకాంక్షలకు మద్దతు – మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.



 ఉద్దానం ప్రజల ఆకాంక్షలకు మద్దతు – మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస, జూన్ 8:

 "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమంలో భాగంగా పలాస నియోజకవర్గంలోని కాశీబుగ్గలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టౌన్ హాల్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధ్యక్షత వహించారు. పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలు, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, ఉద్దానం ప్రాంత ప్రజల దీర్ఘకాల పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని తెలిపారు. కార్గో ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందన్న ప్రచారం అసత్యమని స్పష్టం చేశారు.

అభివృద్ధికి తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అయితే వేలాది ఎకరాల పచ్చని వ్యవసాయ భూములను కోల్పోయే విధంగా ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేపట్టడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రైతులకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు.

వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి పంచాయతీ పరిధిలో సుమారు 1890 ఎకరాల సాల్ట్ ల్యాండ్స్ అందుబాటులో ఉన్నాయని, అక్కడ కార్గో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలు ఇటువంటి ప్రాంతాల్లోనే నిర్మించబడ్డాయని గుర్తుచేస్తూ, అధికారులు శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సూచించారు.

భావనపాడు పోర్టు నిర్మాణం సందర్భంగా ప్రజల అభిప్రాయాలను గౌరవించి గతంలో మార్పులు చేసినట్లు గుర్తుచేసిన ఆయన, కార్గో ఎయిర్‌పోర్ట్ విషయంలో కూడా ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం పునరాలోచన చేసి నగరంపల్లి ప్రాంతాన్ని పరిశీలించాలని డిమాండ్ చేసిన సీదిరి అప్పలరాజు, రైతుల నుంచి భూములు సేకరించకుండా ప్రత్యామ్నాయ ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అన్నారు.

అలాగే జీడిపిక్కలకు గిట్టుబాటు ధర కోరుతున్న రైతులను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొంటూ, రైతుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు మరియు మేధావులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post