అనకాపల్లి జిల్లా రైతు పరిరక్షణ సమితి అధ్యక్షునిగా కన్నా రావు!


అనకాపల్లి జిల్లా రైతు పరిరక్షణ సమితి అధ్యక్షునిగా కన్నా రావు!

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జులై:03

అనకాపల్లి జిల్లా రైతు పరిరక్షణ సమితి అధ్యక్షునిగా ఆడారి కన్నా రావు నియమితులయ్యారు.ఈ మేరకు జాతీయ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు మండడపు శ్రీనువాసరావు నుంచి నియామకపు ఉత్తర్వు వెలువడింది.అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కస్పాజగన్నాధపురం గ్రామానికి చెందిన కన్నా రావు స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే.రైతులకు సంబంధించిన సమస్యల్ని గుర్తించి సంబంధిత అధికారులు దృష్టి కి తీసుకురావడం,రైతులు పండించిన పంటలకు ధరలపై అవగాహన పరచడం, సంస్థ బలిపేతానికి గ్రామస్థాయి నుంచి సభ్యత్వాలు పెంపు వంటి అంశాలు పై ఈ సమితి ప్రధానంగా దృష్టి సారించనుంది.జిల్లా బాధ్యతలను అప్పగించిన జాతీయ సంఘానికి విధేయుడిగా ఉంటూ సమితి పురోభివృద్ధి కి తన వంతు అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా కన్నా రావు తెలియజేసారు.తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.సమితి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీనువాసరావును అభినందించారు.కన్నారావు సతీమణి గతంలో కె.జె పురం నుంచి మండల ప్రాదేశిక సభ్యురాలు గా ఎన్నికయ్యారు.కన్నారావు నియామకం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post