పలాసలో విషాదం: ఆటో డ్రైవర్ అనుమానస్పద మృతి !
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని జయరామచంద్రపురం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పూడి చిన్నబాబు (32, తండ్రి: చలపతి, వృత్తి: ఆటో డ్రైవర్) అనే యువకుడు అనుమానస్పద మృతి
స్థానికులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నిన్న మధ్యాహ్నం చిన్నబాబు తాలబద్ర గ్రామంలో జరుగుతున్న ఒక సంబరాల భోజనానికి హాజరయ్యాడు.
ఆ తర్వాత రాత్రి వరకు చిన్నబాబు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. ఈ క్రమంలో రాత్రి 11:30 గంటల ప్రాంతంలో జయరామచంద్రపురం శివారులోని తోటలో, ఒక టేకు చెట్టుకు తాడుతో ఉరివేసుకుని చిన్నబాబు నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. ఘటనా స్థలంలో అతను తాగిన మద్యం సీసా కూడా లభ్యమైందని అన్నారు
మృతుడు చిన్నబాబుకు ఇంకా వివాహం కాలేదు. చేతికందివచ్చిన కొడుకు చిన్న వయసులోనే క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం కోసం పలాస గవర్నమెంట్ హిస్పిటల్ కి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
