పలాస కిడ్నీ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి.



 
పలాస కిడ్నీ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.

పలాస, జూలై 4:

 పలాసలోని ప్రభుత్వ కిడ్నీ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ మొహమ్మద్ మౌలానా శనివారం సందర్శించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె. హరిబాబు, పలాస జూనియర్ సివిల్ జడ్జి యూ. మాధురి ఆయన వెంట ఉన్నారు.

ఆసుపత్రిలోని డయాలసిస్ వార్డులు, ఇన్‌పేషెంట్ విభాగాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి రోగులకు అందుతున్న వైద్య సేవలు, పరీక్షలు, చికిత్స విధానంపై ఆరా తీశారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలు, చికిత్సా విధానాన్ని వైద్యులు వివరించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కుటుంబ సభ్యులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. ఆసుపత్రికి చేరుకోవడంలో రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఉద్దానం ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న కిడ్నీ వైద్య సేవలు, ప్రత్యేక చికిత్సా సౌకర్యాలపై ఆసుపత్రి ఆర్‌ఎంఓ, మెడికల్ సూపరింటెండెంట్ వివరించారు.

కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమిని, కిడ్నీ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీహరిబాబు, సూపరింటెండెంట్ డాక్టర్ శరత్ జ్యోత్స్న, డాక్టర్ రామ్ నరేష్, కాశీబుగ్గ సీఐ రామకృష్ణతో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post