జూలై 11న జాతీయ లోక్ అదాలత్.


 జూలై 11న జాతీయ లోక్ అదాలత్.

గిద్దలూరు లో వచ్చే నెల 11న జాతీయ లోక్ అదాలత్ పై సమీక్షా సమావేశం న్యాయమూర్తి. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా గిద్దలూరు జూలై 11 వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ గురించి పోలీస్ అధికారులతో  గిద్దలూరు మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి కె. భరత్ చంద్ర  సమీక్ష సమావేశం నిర్వహించారు. గిద్దలూరు కోర్టుల పరిధిలోని ఆరు మండలాల పోలీస్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాజీపడదగిన  క్రిమినల్ కేసులందు కక్షిదారులను గుర్తించి, వారి కేసులను రాజీ చేసుకోవడం ద్వారా విలువైన సమయమును మరియు ధనమును ఆదా చేసుకుంటారని, అప్పీలు లేని అవార్డును పొందవలసినదిగా అవగాహన కల్పించాలని న్యాయమూర్తి  పోలీస్ అధికారులకు తెలియజేసారు.

ఈ జాతీయ లోక్ ఆదాలత్ నందు అన్ని రకముల సివిల్ కేసులు, భరణం, గృహహింస, చెక్ బౌన్స్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు మరియు న్యాయస్థానాల వరకు వెళ్ళని ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ చేసుకుని, ప్రశాంతమైన జీవితమును గడపాలని ఆయన కక్షిదారులకు పిలుపునిచ్చారు. ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చర్యలు చేపట్టవలసినదిగా పోలీస్ అధికారులకు న్యాయమూర్తి  తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో గిద్దలూరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.సురేష్, అర్థవీడు సబ్ ఇన్స్పెక్టర్ ఎం శివ నాంచారయ్య, గిద్దలూరు, బేస్తవారిపేట, కంభం, రాచర్ల  కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post