ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైన బోయపాటిని పరామర్శించిన కృష్ణ కిషోర్ రెడ్డి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం, పెంచికలపాడు సమీపంలో, అర్ధవీడు మండలం యాచవరం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు బోయపాటి వెంకటేశ్వర్లు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురయ్యారు.
ఈ ప్రమాదంలో ఆయన కుడి చేయి విరగడంతో కార్యకర్తలు కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి తక్షణమే కంభం ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని బోయపాటిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు, చేయి వి రగడంతో మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించడంతో, తక్షణమే స్పందించి కృష్ణ కిషోర్ రెడ్డి నరసరావుపేట ప్రముఖ అమూల్య ప్రైవేట్ వైద్యశాల అధినేత, శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారితో మాట్లాడి బోయపాటికి మెరుగైన వైద్యం అందించాలని వారిని కోరారు. అధైర్య పడొద్దని బోయపాటికీ దైర్యం చెప్పారు.
