ముఖ్యమంత్రి ఆదేశాలతో మూగ వ్యక్తి సాగర్‌కు రూ.2 లక్షల ఆర్థిక సాయం.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పలాస ప్రాంతానికి చెందిన మూగ వ్యక్తి సాగర్ మహారాణా కలిసి తన కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులను వివరించారు.
సాగర్ పరిస్థితిని సానుభూతితో విన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, అతని కుటుంబానికి ప్రభుత్వ తరఫున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు స్వయంగా సాగర్ నివాసానికి వెళ్లి, ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2 లక్షల విలువైన చెక్కును ఆయనకు మరియు కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల కష్టాలను గుర్తించి వెంటనే స్పందించడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు. అవసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు.
తమ సమస్యను గుర్తించి ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే సహాయ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే గౌతు శిరీష గారికి సాగర్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజల సమస్యలపై ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ అవసరమైన సహాయాన్ని అందించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

