కే కే ఆర్ గౌతమ్ విద్యా సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఏఐఎస్ఎఫ్, ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నోట్ బుక్స్ విక్రయిస్తున్న కేకేఆర్ గౌతమ్ విద్యాసంస్థ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ డిమాండ్ చేశారు.స్థానిక ఏలూరు సత్రంపాడులో గల కే కే ఆర్. గౌతమ్ స్కూల్ విద్యాసంస్థ యాజమాన్యం వారు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠ్యపుస్తకాలు ,యూనిఫామ్, టై,బెల్ట్,విక్రయించడమే కాకుండా పేద విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద అధిగ ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులు కార్పొరేట్, ప్రవేట్ విద్యాసంస్థల్లో చదవాలంటే వేల రూపాయలు కట్టి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాఠశాలల్లో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, టై,బెల్ట్, విద్యార్థులు తీసుకోకపోతే బెదిరిస్తూ,వాళ్లను మానసికంగా వేధిస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ కార్పొరేట్, విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారి ఎంఈఓ మాత్రం కాసులకు కక్కుర్తి పడి కార్పొరేట్, ప్రవేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాయటం సిగ్గుచేటన్నారు. తక్షణమే కే కే ఆర్.గౌతమ్ స్కూల్, విద్యాసంస్థలపై సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణం స్పందించి ఏలూరు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) పై సమగ్ర విచారణ చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్,ఏలూరు జిల్లా నాయకులు సిద్దు,నగర నాయకులు, ఆకాష్,నరేంద్ర, పృద్వి,మురళి, విజయ్,మణికంఠ,మున్నా, నాయకులు పాల్గొన్నారు.
