గంజాయి నిర్మూలనే ధ్యేయం: డ్రోన్ కెమెరాలతో అనకాపల్లి జిల్లా పోలీసుల విస్తృత తనిఖీలు.



 గంజాయి నిర్మూలనే ధ్యేయం: డ్రోన్ కెమెరాలతో అనకాపల్లి జిల్లా పోలీసుల విస్తృత తనిఖీలు.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి.నర్సీపట్నం,జూన్:20 

అనకాపల్లి జిల్లాలో గంజాయి సాగు, రవాణాను పూర్తిగా అరికట్టడమే ధ్యేయంగా పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మరియు నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు అదేశాల మేరకు.. శనివారం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అత్యాధునిక డ్రోన్ కెమెరాల సహాయంతో విస్తృత నిఘా మరియు తనిఖీలు చేపట్టారు.

*అడవుల్లో డ్రోన్ నిఘా:* గంజాయి సాగుపై చెక్

నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, కేడీపేట ఎస్సై తారకేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి గంజాయి సాగుకు ఆస్కారం ఉన్న పలు ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.

​బంగారమెట్ట, పల్లూరు, కొంగసింగి ప్రాంతాలతో పాటు ఎల్.పురం వైపు వెళ్లే అటవీ, కొండ ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు.

​ఈ విస్తృత తనిఖీల్లో సదరు ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఎలాంటి గంజాయి సాగు (తోటలు) లేదని అధికారులు స్పష్టం చేశారు.

రవాణా మార్గాలపై ప్రత్యేక కన్ను అక్షాంశాలు, రేఖాంశాల గుర్తింపు​మరోవైపు, కొత్తకోట ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో సి.కె.పాడు గ్రామ శివార్లలో డ్రోన్ కెమెరాలను ఎగురవేశారు. గంజాయి రవాణాకు ఉపయోగించే ప్రత్యామ్నాయ రహదారులు, కొండల మధ్య ఉండే కాలినడక మార్గాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.

గంజాయిని దాచి ఉంచే అవకాశం ఉన్నట్లు అనుమానించిన రహస్య స్థావరాల యొక్క అక్షాంశాలు, రేఖాంశాలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రికార్డు చేశారు. అనంతరం ఆయా పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు.

*పోలీసుల హెచ్చరిక:* ​జిల్లాలో గంజాయి సాగు చేసినా, అక్రమంగా రవాణా చేసినా ఎంతటి వారైనా సరే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు హెచ్చరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అటవీ ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post