పాఠశాల స్థలం ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి.


పాఠశాల స్థలం ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి.

 హిందూ ఎయిడెడ్ పాఠశాల కరస్పాండెంట్ వాసే.కృపా రాజకుమారి.

ఏలూరు, జూన్ 20,క్రైమ్ 9 మీడియా ప్రతినిధి.

ఏలూరు నగరంలోని కొమడవోలు గ్రామంలో ఉన్న హమాలీ కాలనీలో హిందూ ఎయిడెడ్ పాఠశాల యొక్క ఆవరణ స్థలాన్ని ఆక్రమణకు గురి చేస్తున్నారంటూ పాఠశాల యాజమాన్యం ఆరోపించారు. గత 40 సంవత్సరాలుగా ఈ పాఠశాల నడుస్తున్నదని పాఠశాల ముందున్న ఖాళీ స్థల ఆక్రమణకు కొంతమంది ఆక్రమించుకొనుటకు ప్రయత్నించి బెదిరిస్తున్నారని పాఠశాలకు చెందిన హెడ్ మాస్టర్ జేసుదాస్, కరస్పాండెంట్ కృపా రాజకుమారి ఆరోపించారు. పాఠశాల ఎదురుగా ఉన్న చెట్టు వద్ద దేవాలయ విగ్రహాలు ఉన్నాయని అయితే పాఠశాల యజమాన్యం చెప్పినట్లుగా చెట్టు చుట్టూ భక్తులు తిరగడానికి స్థలం మాత్రమే దానికి సంబంధించినదని మిగతా స్థలం అంతా పాఠశాలకు చెందిందే అని తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి అంటూ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ ప్రాంతానికి చెందిన కొందరు పెద్దలు స్థలాన్ని ఆక్రమించుకొనుటకు ప్రయత్నాలు చేస్తూ తమను బెదిరిస్తున్నారు అంటూ ఆరోపించారు. కొంతమంది ఆక్రమణదారులు శనివారం పాఠశాల ఆవరణలో టెంటు వేసి గోడ నిర్మాణం చేసుకునేందుకు పూజలు చేశారని హిందూ ఎయిడెడ్ పాఠశాల హెడ్మాస్టర్ వాసే.జేసుదాస్, కరస్పాండెంట్ వాసే కృపా రాజకుమారి, కమిటీ మెంబర్ ఆనం.శ్రీనివాసరావు తెలియజేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post