పలాసలో వైసీపీ మహా నిరసన ర్యాలీకి విశేష స్పందన.
భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు: వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 14:
కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలాస పట్టణంలో నిర్వహించిన మహా నిరసన ర్యాలీ విజయవంతమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న విధానాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో జరిగిన వైఫల్యాలు, సంక్షేమ కార్యక్రమాల నిలిపివేత వంటి అంశాలను ప్రజలకు వివరించేందుకు ఈ నిరసన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు.
పలాస పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ర్యాలీలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, మహిళలు, యువత, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ విధానాలపై తమ నిరసనను వ్యక్తం చేశారని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని, రాబోయే రోజుల్లో ప్రజా ప్రయోజనాల కోసం మరింత బలంగా ఉద్యమిస్తామని బమ్మిడి దుర్యోధనరావు స్పష్టం చేశారు.
