చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యలు పట్ల అవగాహన. సీఐ అప్పలరాజు.


 చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యలు పట్ల అవగాహన. సీఐ అప్పలరాజు.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జూన్:24

    చోడవరం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో చోడవరం సీఐ శ పి. అప్పలరాజు,SHO చోడవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్‌ఐ, శబి. జోగారావు ఎస్సై చోడవరం మరియు చోడవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, ఆరోగ్యపరమైన, సామాజిక మరియు ఆర్థిక నష్టాల గురించి వివరంగా అవగాహన కల్పించారు.

మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని, విద్యాభ్యాసం, కుటుంబ జీవితం మరియు వ్యక్తిత్వ వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. గంజాయి, మత్తు మాత్రలు మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు నేరాలకు పాల్పడే అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.

అలాగే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయం మరియు వినియోగంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని, అటువంటి కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, విద్య మరియు సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని కోరారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పిస్తామని సంకల్పం చేయించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని మాదక ద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడగా, సమాజాన్ని మత్తు పదార్థాల రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు పిలుపునిచ్చారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post