నారీశక్తి – మహిళల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం: ఎస్ఐ నరసింహామూర్తి.


 నారీశక్తి – మహిళల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం: ఎస్ఐ నరసింహామూర్తి.

 - సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాల నియంత్రణ.

- మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలి.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస / కాశీబుగ్గా, మే 22: సమాజంలో మహిళల రక్షణ, భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అగ్రతాంబూలం ఇస్తుందని స్థానిక కాశీబుగ్గా సబ్ ఇన్స్పెక్టర్ నరసింహామూర్తి పేర్కొన్నారు. 'నారీశక్తి' కార్యక్రమంలో భాగంగా మహిళల రక్షణ, గ్రామాలు మరియు పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన శుక్రవారం శివాజి నగర్ లో ప్రజలకు, మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ నరసింహామూర్తి మాట్లాడుతూ.. మహిళలు, యువతుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నేరాల నియంత్రణ:

సీసీ కెమెరాల నిఘా ఉండటం వల్ల అసాంఘిక శక్తులు, ఆకతాయిల ఆటకట్టించవచ్చని, ఏదైనా సంఘటన జరిగినా నిందితులను త్వరగా పట్టుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్ఐ తెలిపారు.

కమ్యూనిటీ పోలీసింగ్: 

వ్యాపారస్తులు, కాలనీల నివాసితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఇళ్లు, దుకాణాల వెలుపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

 టెక్నాలజీ వినియోగం: మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం అందుబాటులో ఉన్న యాప్‌లను, టోల్ ఫ్రీ నంబర్లను (112) ఉపయోగించుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువతులు, వార్డ్ పెద్దలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post