ఇసుక డిపోను తనిఖీలు నిర్వహించిన గనులు మరియు భూగర్భ శాఖ అధికారులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా కొత్త బైపాస్ రోడ్డు కొప్పోలు జంక్షన్ ఒంగోలులో ఉన్న ఇసుక డిపో తనిఖీ నిమిత్తం గనులు మరియు భూగర్భ శాఖ డిడి టి. రాజశేఖర్ గారు, టెక్నికల్ అసిస్టెంట్ అయినా ఆది నాయుడు గారు, మరో టెక్నికల్ అసిస్టెంట్ సురేష్ బాబు గారు, ఇసుక డిపోను తనిఖీ చేయడం జరిగింది,
నాణ్యమైన ఇసుకను అందించడానికి సగటు వినియోగదారుడు సంతృప్తి చెందే విధంగా ఆన్లైన్లో ఇసుక బిల్లులను తీయడం జరిగినది.
P4 కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఎటువంటి కష్టం రానీయకుండా వేగంగా ఇసుక సరఫరా చేయడానికి తగిలిన చర్యలు చేపట్టాలని సూచించారు
