వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన వ్యవసాయ కార్యక్రమాలు, రైతు సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ, పచ్చి ఎరువు విత్తనాల పంపిణీ, ఖరీఫ్‌కు అవసరమైన ఎరువుల నిల్వలు, ఖరీఫ్ 2026-27 కార్యాచరణ ప్రణాళిక, KPI లక్ష్యాల సాధన, ఏ పి ఏ ఐ ఎం ఎస్ రైతు యాప్ నమోదు ప్రక్రియ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
అలాగే పంట మార్పిడి, పంట దిగుబడి పెంపు చర్యలు, సేంద్రియ ఎరువుల వినియోగం, భూసార పరిరక్షణ మరియు సహజ వ్యవసాయ విధానాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని శాసనసభ్యులు సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులు సాంకేతికంగా పురోగతి చెందేందుకు ప్రవేశపెట్టిన ఏ పి ఏ ఐ ఎం ఎస్. రైతు యాప్‌లో ప్రతి రైతు నమోదు అయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇంకా నమోదు కాని రైతులను గుర్తించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. రైతులకు యాప్ వినియోగం, పంట నమోదు, సబ్సిడీలు మరియు ఇతర సేవలపై విస్తృత అవగహన కల్పించాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ విధానంపై కూడా అధికారులతో సమీక్షించారు. రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం, దరఖాస్తుల పరిశీలన అనంతరం లబ్ధిదారుల ఎంపిక, ఎంపికైన రైతులు ప్రభుత్వం నిర్ణయించిన నాన్-సబ్సిడీ మొత్తాన్ని చెల్లించే విధానము తదుపరి యంత్ర పరికరాలు అందజేయుట గురించి చర్చించారు.
పారదర్శకతతో అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమం లో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు బాలాజీ నాయక్ ,శ్రీమతి రాజశ్రీ మరియు మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
