మొరాయించిన ఆర్టీసీ బస్సులు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
రెండు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఒకేసారి పలాస సమీప జాతీయరహదారి పై మొరాయించడంతో ప్రయాణీకుల తిప్పలు వర్ణనాతీతం. టైరు పంక్చర్ తో పల్లెవెలుగు బస్సు ఆగిపోయిన ఆమడదూరంలోనే అదేసమయంలో మరో ఎక్స్ప్రెస్ బస్సు ఎలెక్ట్రికల్ సమస్యతో మొరాయించడంతో రెండు బస్సులకు చెందిన ప్రయాణీకులు నానా ఇబ్బందులకు గురయ్యారు.
శ్రీకాకుళం జిల్లా పలాస సమీప జాతీయరహదారి పై పలాస నుండి ఇచ్చాపురం వెళ్తున్న పలాస డిపోకి చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు టైరు పంక్చర్ కాగా అదే సమయంలో ఇచ్చాపురం వెళ్తున్న టెక్కలి టిపోకి చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఎలెక్ట్రికల్ సమస్యతో ఆగిపోయింది.ఇలా రెండు బస్సులు ఒకేసారి మొరాయించడంతో, బస్సుల్లో ఉన్న ప్రయాణీకులు నానా ఇబ్బందులకు గురయ్యారు.
చీకటి పడుతున్న వేళ బస్సులు ఆగిపోడంతో కొంతమంది ఆటోలను ఆశ్రయించగా,మరికొందరు ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో మరో బస్సుకు వేచి చూసారు.
కాలం చెల్లిన బస్సుల్లో ప్రయాణం చేయాలంటే ఏ క్షణాన ఎక్కడ మొరాయిస్తాయో తెలియని స్థితిలో ఆర్టీసీ బస్సులు ఉన్నాయంటూ ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

