ఏలూరు అమలోద్భవి మాత నూతన ఆలయ ప్రతిష్ట కార్యక్రమం


 ఏలూరు అమలోద్భవి మాత నూతన ఆలయ ప్రతిష్ట కార్యక్రమం 

క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

 ఏలూరు నగరంలోని స్థానిక అశోక్ నగర్ అమలోద్భవి మాత నూతన ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమలోద్భవి మాత విచారణ గురువు రెవెరెండ్ ఫాదర్ డాక్టర్ ఇంజేపాల్ గురువు ఆధ్వర్యంలో మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమేర డిడి బిషప్ ఆఫ్ ఏలూరు, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఉడుముల బాల డిడి ఆర్చ్ బిషప్ విశాఖపట్నం, మోస్ట్ రెవరెండ్ రాయరాల విజయ్ కుమార్ డిడి బిషప్ ఆఫ్ శ్రీకాకుళం ముగ్గురు పీఠాధిపతులు మీదుగా అత్యంత వైభవంగా ప్రతిష్టించారు.

అమలోద్భవి మాత విచారణ గురువు రెవెరెండ్ ఫాదర్ డాక్టర్ . ఇంజె పాల్ నూతన ఆలయం కోసం భక్తి మరియు శ్రద్ధతో శ్రమించి నిర్మించారని తెలిపారు . ఈ నూతన ఆలయ నిర్మాణంలో అశోక్ నగర్ క్రైస్తవులు, ఫాదర్ రాజు మరియు ఫాదర్ అమ్మన రాజు ఎంతో సహకారం అందించారని రెవరెండ్ ఫాదర్ డాక్టర్. ఇంజె పాల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అశోక్ నగర్ క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమలోద్భవి మాత ఆశీస్సులు పొందారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post