డీ లిమిటేషన్ పై శ్రీకాకుళం లో జనసేన సమీక్షా సమావేశం.


 డీ లిమిటేషన్ పై శ్రీకాకుళం లో జనసేన సమీక్షా సమావేశం.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.

జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నియోజకవర్గాల విభజన(డీ లిమిటేషన్) పై సమగ్ర చర్చ,నాయకుల సూచనలు సలహాలు స్వీకరణ అనే సమీక్షా సమావేశాన్ని సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లాకేంద్రంలో గల జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు.

జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ,పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు,విశాఖపట్నం సౌత్ శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ హాజరుకాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పండా సమావేశానికి హాజరైన శాసనసభ్యులకు దుస్సాలువలు కప్పి పుష్పగుచ్చాలతో సత్కరించి ఆహ్వానించారు.

సమావేశంలో పలువురు నాయకులు,జనసైనికులు స్థానిక సంస్థల ఎన్నికలు,నియోజకవర్గాల పునర్విభజన అనే పలు అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశంలో శ్రీకాకుళం జిల్లా లోగల పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు, కార్యవర్గసభ్యులు,పలాస మునిసిపాలిటీ కిచెందిన జనసైనికులు,వీరమహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post