అనుమలవీడులో ప్రజల భద్రతే లక్ష్యంగా సి.ఐ. రామకోటయ్య బృందంతో కార్డెన్ సెర్చ్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా రాచర్ల మండల పరిధిలోని అనుమలవీడు గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు.
గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. జె.రామకోటయ్య నేతృత్వంలో జరిగిన ఈఆపరేషన్‌లోరాచర్ల పోలీసులు గ్రామాన్ని జల్లెడ పట్టారు.
సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలపై పోలీసులు కొరడా ఝులిపించారు.
మొత్తం 31 బైకులను స్వాధీనం చేసుకోగా, అందులో ఎటువంటి ఆధారాలు లేని 3 వాహనాలను సీజ్ చేశారు.
