అభివృద్ధిలో పోటీ పడండి.. అసహనం తో పోటీ పడకండి..


 అభివృద్ధిలో పోటీ పడండి.. అసహనం తో పోటీ పడకండి..

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను ప్రశ్నించిన పలాస వైసిపి నేతలు.

 బాటిల్ పై 20 రూపాయలకు పైగా సిండికేట్లు వసూలు చేస్తూ పేదల రక్త మాంసాన్ని దోచుకోవడమే సంపద సృష్టి లాగా కనిపిస్తుందా అని వైఎస్ఆర్సిపి పలాస నియోజకవర్గ అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు, వైయస్సార్సీపి పలాస పట్టణ అధ్యక్షులు శిష్టు గోపి ఆరోపించారు. శుక్రవారం పలాసలో వైయస్ఆర్సీపీ కార్యాలయమైన ప్రగతి భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని సుదీర్ఘకాలం ప్రజా ప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించిన గౌతు కుటుంబీకులు అభివృద్ధి చేసి ఉంటే, ఇక్కడ ప్రజలు వలస పోయి ఉండేవారు కాదని, తాత, తండ్రి తోపాటు కుమార్తె ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయినప్పటికీ, వారి కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించి అభివృద్ధి చెందారే తప్ప,ఈప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు ఏమాత్రం మెరుగు పడలేదని వారు విమర్శించారు. 

వైయస్సార్సీపి ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చర్చకు సిద్ధమేనా? అంటూ వైఎస్ఆర్సిపి నేతలు సవాల్ విసిరారు. ప్రధానంగా పలాస నియోజకవర్గంలో నిరుపేదలకు జగనన్న ఇండ్ల కాలనీలు ఇచ్చారని, రెండేళ్ల కూటమి పాలనలో ఒక్క నిరుపేద కైనా సెంటు భూమి ఇచ్చారా ? అని వారు ప్రశ్నించారు. నాటి ప్రభుత్వంలో డాక్టర్ సీదిరి అప్పలరాజు కృషి మేరకు సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో పలాస కిడ్నీ రీసెర్చ్ కేంద్రం, 700 కోట్ల రూపాయల వ్యయంతో హిరమండలం నుంచి ఇచ్చాపురం వరకు వంశధార తాగునీటి జలాలు ప్రజలకు అందించేందుకు వైయస్సార్ సుజల ధార ప్రాజెక్టు సాధించుకోవడం జరిగిందన్నారు. అలాగే పలాసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు, కాశీబుగ్గలో కేటీ రోడ్డు ఆధునికరణ, మందస రోడ్డు ఆధునికరణ, నువ్వల రేవు నుంచి పలాస వరకు డబల్ రోడ్డు ఆధునీకరణ , 68 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, జగనన్న స్మార్ట్ సిటీ, జగనన్న కాలనీ వంటి శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వారు గుర్తు చేశారు. ప్రధానంగా ప్రతి గ్రామపంచాయతీలో గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు ఏర్పాటు చేయడమే కాక రైతు భరోసా కేంద్రాలు, కీలక రహదారులు నిర్మాణం చేపట్టారని, మరి కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా రో పలాస ఎమ్మెల్యే స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. పలాస నియోజకవర్గ ప్రజల దృష్టిలో మాత్రం కూటమి ప్రభుత్వం హయాంలో భూకబ్జాలు, కంకర, మట్టి మాఫియా, మద్యం సిండికేట్ వంటి వ్యవస్థలు మాత్రం పెంచి పోషించడంలో తెలుగుదేశం పార్టీ చెందిన నేతలే ముందు వరుసలో ఉంటారని వైయస్సార్సీపి నేతలు ఎద్దేవా చేశారు. మరో అంశం ఏమంటే పలాస పిఎసిఎస్ విషయంలో 2005 నుంచి 2024 వరకు అప్పటి పాలకవర్గాలు అవినీతికి పాల్పడ్డాయి అంటూ.. తలా తోక లేని దుష్ప్రచారం ఎమ్మెల్యే చేయడం సబబుగా లేదని, ఒకవేళ అవినీతి జరిగి ఉంటే విచారణకు ఆదేశించాలే తప్ప తప్పుడు ఆరోపణలు చేసి, ప్రజలకు తప్పు తోవ పట్టించడం సమంజసం కాదన్నారు. పలాస పిఎసిఎస్ భవన నిర్మాణానికి గాని స్థల సేకరణ విషయంలో గాని అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ గాని, ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీష గాని ఒక్క ఇటుక కూడా సాయం చేయలేదని, వైయస్సార్సీపి ప్రభుత్వం పలాస పిఎసిఎస్ భవనం నిర్మించుకోవడంజరిగిందన్నారు. ఏదో కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చామంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పు కాదు గాని, వైయస్సార్సీపి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఆధునికరించబడ్డాయని, మళ్లీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చి ఉంటే విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు మరిన్ని వచ్చి ఉండేవని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించకుండా ఏవేవో చిన్న చిన్న కార్యక్రమాల లో పాల్గొన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై సహనం కోల్పోయి అసహనంతో నోటికి వచ్చినట్లు అవాకులు చవాకులు మాట్లాడడం బాగోలేదని, తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని, పలాస నియోజకవర్గ నేత డాక్టర్ అప్పలరాజు పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని, అసలు డాక్టర్ అప్పలరాజును విమర్శించే నైతిక అర్హత ఆమెకు లేదని, అందుకు పలాస నియోజవర్గ అభివృద్ధిని విస్మరించి, తిట్ల పురాణం తూ కాలక్షేపం చేస్తుందన్నారు.

60 ఏళ్లలో అభివృద్ధి ఎవరు చెందారంటే.. గౌతు కుటుంబమే! సంపద సృష్టిస్తామంటూ.. అధిక ధరలకు మద్యాన్ని అక్రమంగా విక్రయించి దోచుకోవడమేనా? ఐదేళ్ల వైయస్సార్సీపి పాలనలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా పలాస పిఎసిఎస్ లో అవినీతి ఉంటే విచారణకు ఆదేశించారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంటే.. భూకబ్జాలు, అధిక ధరకు మద్యం విక్రయాలు, చెరువుల ఆక్రమణ, గ్రావిల్, మట్టి మాఫియా రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కంటే.. వైయస్సార్సీపి హయాంలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల వద్ద ఫోటోలు కు ఫోజులిస్తారా? వైయస్ జగన్ డాక్టర్ అప్పలరాజుకు విమర్శించే స్థాయి మీది కాదు.. ఖరీఫ్ సీజన్లో ధాన్యం విత్తనాలైనా రైతాంగానికి అందించే సత్తా మీకు ఉందా. పలాసలో కిడ్నీ రీసెర్చ్ కేంద్రం పై మాట్లాడే అర్హత మీకు లేదు.. అభివృద్ధిలో పోటీ పడండి.. అసహనం తో పోటీ పడకండి.. నిరుపేదలకు ఇంటి స్థలాలు.. ఇండస్ట్రియల్ ఎస్టేట్.. జగనన్న స్మార్ట్ సిటీ, కేటి రోడ్డు ఆధునీకరణ వైయస్సార్సీపి హయంలోనే శ్రీకారం రెండేళ్ల కాలంలో ఒక్క నిరుపేద కైనా సెంటు భూమ ఇచ్చారా? పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు ప్రశ్నించ్చారు. కూటమి ప్రభుత్వ రథసారథి చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తామంటే , మా ప్రాంతమైన పలాస నియోజకవర్గానికి ఏవైనా పరిశ్రమలు వస్తే, ఉపాధి అవకాశాలు మెరుగుపడి వలసలు నిరోధించబడతాయని ప్రజల ఆశించగా, అందుకు భిన్నంగా నిరుపేద శ్రమజీవుల బలహీనత అయిన మద్యం సేవించినప్పుడు అదనంగా బాటిల్ పై 20 రూపాయలకు పైగా సిండికేట్లు వసూలు చేస్తూ పేదల రక్త మాంసాన్ని దోచుకోవడమే సంపద సృష్టి లాగా కనిపిస్తుందని భవిష్యత్తులో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పలాస ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, కాబట్టి పలాస ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోవాలని వైయస్సార్సీపీ నేతలు హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో వైయస్ఆర్సీపీ నేతలు నర్తు వెంకటరమణ, గుజ్జు జోగారావు, బి. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post