మహానాడు వేదికగా మహిళా సాధికారతకు చారిత్రాత్మక బాటలు.


 మహానాడు వేదికగా మహిళా సాధికారతకు చారిత్రాత్మక బాటలు.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస టిడిపి కార్యాలయంలో మహిళా నేతల పాత్రికేయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ...

మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్లకు బలమైన పునాది వేస్తూ, ప్రకటనలకే పరిమితం కాకుండా చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించేలా తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని కొనియాడారు. మహిళలకు రాజకీయ స్వేచ్ఛ, సముచిత స్థానం కల్పించినందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

మహిళా సంక్షేమం - చారిత్రక నిర్ణయాలు:

• రాజకీయ ప్రాధాన్యత: మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం నుండి, దేశంలోనే తొలి మహిళా స్పీకర్ నియామకం వరకు టీడీపీ పాత్ర మరవరానిది. విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. 

• ఆర్థిక స్వావలంబన (డ్వాక్రా): రాష్ట్రంలో 12 లక్షల డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేసి, 1.12 కోట్ల మంది మహిళలకు ఉపాధి కల్పించారు. బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.68,830 కోట్ల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. 

• మహిళా పారిశ్రామికవేత్తలు: రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంతో, ఇప్పటికే 1.20 లక్షల మందికి 45 శాతం పెట్టుబడి రాయితీతో ప్రోత్సాహం అందిస్తున్నారు. 

ప్రభుత్వ సంక్షేమ పథకాలు – ప్రగతి:

• ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: ప్రతి నెలా 37.92 లక్షల మంది మహిళలకు రూ.1,594 కోట్ల సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. 

• స్త్రీశక్తి పథకం: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా, ఇప్పటివరకు 60 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. 

• తల్లికి వందనం: ఈ పథకం ద్వారా 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేయడం జరిగింది. 

• దీపం & దీపం 2.0: వంటింటి కష్టాలను తీరుస్తూ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు. 

మహిళా భద్రతకు పెద్దపీట:

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి జోలికి వస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వేధింపులు, దాడులపై ఎలాంటి రాజీ లేకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే నమ్మకాన్ని మహిళల్లో కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. మహానాడులో తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతోమంది మహిళలను గృహాలకే పరిమితం కాకుండా, ప్రజా సేవలో భాగస్వామ్యులను చేస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయి.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post