మహిళా బిల్లు – మహిళా సాధికారతకు చారిత్రాత్మక నిర్ణయం : గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి
శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మహిళా సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిందని ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకునేలా మార్గం చూపిన పార్టీ తెలుగుదేశం పార్టీయేనని ఆమె అన్నారు.
అన్న నందమూరి తారక రామారావు మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించి వారి ఆర్థిక స్వావలంబనకు బలమైన పునాది వేశారని గుర్తు చేశారు. ఆ ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దేందుకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి, వారికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు.
మహిళలు మరింతగా నాయకత్వ స్థానాలకు ఎదగాలనే లక్ష్యంతో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని గౌతు శిరీష పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు, సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో మహిళల పట్ల అవమానకర ధోరణి కొనసాగిందని ఆమె విమర్శించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన మహిళలను సైతం అవమానించే విధంగా మాట్లాడించడం అత్యంత దురదృష్టకరమన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం వారిని హీనంగా చూడడం ప్రజాస్వామ్యానికి మచ్చగా నిలిచిందని అన్నారు.
రాష్ట్రంలో మహిళల భద్రత పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులను ప్రజలు గత ప్రభుత్వ హయాంలో చూశారని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు మళ్లీ భరోసా ఏర్పడిందన్నారు. మహిళలు స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
సమాజంలోని ప్రతి రంగంలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ, వారికి గౌరవం, భద్రత, అవకాశాలు కల్పించడమే తెలుగుదేశం పార్టీ ఆశయమని గౌతు శిరీష పేర్కొన్నారు. మహిళల పట్ల నిబద్ధతతో సమాన హక్కులు కల్పిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ మహిళల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
