ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం..!



ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం..!

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వినతులు

 స్వీకరించిన ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు.

మంగళగిరి మే 13 : 

సామాన్య ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహిస్తున్న 'గ్రీవెన్స్' (ప్రజా ఫిర్యాదుల) కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు గారు పాల్గొని బాధితుల నుంచి వినతులను స్వీకరించారు.

​రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను బాబూరావు గారికి విన్నవించుకున్నారు. భూ వివాదాలు, పింఛన్లు, రేషన్ కార్డులు మరియు స్థానిక మౌలిక సదుపాయాల కల్పనపై వచ్చిన వినతులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

​ఈ సందర్భంగా వజ్జ బాబూరావు గారు మాట్లాడుతూ ప్రజల కష్టాలను తీర్చడమే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక బాధ్యత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుంది. ప్రజా ప్రభుత్వం ప్రజల ముంగిటకే వచ్చి సేవలు అందిస్తోంది."

​అనంతరం, అందిన వినతులను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సంబంధిత శాఖల అధికారులతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post