జనగణన సర్వే రెండురోజుల్లో 50 శాతం పూర్తి కావాలి - జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.


 జనగణన సర్వే రెండురోజుల్లో 50 శాతం పూర్తి కావాలి - జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

సిబ్బంది తమ రోజూవారీ లక్ష్యాలను అదేరోజు సాదించాలి.

జిల్లాలో ఇండ్ల గణన వేగవంతం చేసేందుకు జిల్లాపరిషత్ సీఈఓ, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డ్ జిల్లా కోఆర్డినేటర్ లు ప్రత్యేక పర్యవేక్షణ.

త్వరలో మెగా 22ఏ మెగా పరిష్కార మేళా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.

ఇండ్లగణనపై అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్.

ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

          ఏలూరు, మే, 12 : జిల్లాలో జనగణనలో భాగంగా ఇండ్లగణన సర్వే పనులు రెండురోజుల్లోగా 50 శాతం పూర్తికావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇండ్లగణన, 22ఏ భూ సమస్యల పరిష్కార మెగా మేళా ఏర్పాట్లపై స్థానిక కలెక్టరేట్ నుండి మంగళవారం అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జనగణన కార్యక్రమంలో భాగంగా ఇండ్లగణన ను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయవలసి ఉన్న దృష్ట్యా, ఎన్యూమరేటర్లు వారికి నిర్దేశించిన రోజూవారీ లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని, ఈ మేరకు అధికారులు ప్రతీరోజు సమీక్షించుకుని పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ఇండ్ల గణన వేగవంతం చేసేందుకు జిల్లాపరిషత్ సీఈఓ, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డ్ జిల్లా కోఆర్డినేటర్ లను ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా నియమించడం జరిగిందని, జిలాల్లోని మండలాలను ఇద్దరు అధికారులు ప్రతీరోజు సర్వే ప్రగతిని సమీక్షించుకుని సర్వే వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

*త్వరలో 22ఏ మెగా పరిష్కార మేళా కు ఏర్పాట్లు చేయండి* జిల్లాలో 22ఏ భూ సమస్యల పరిష్కారంపై ఏర్పాటుచేసిన మెగా పరిష్కార మేళా కు విశేష స్పందన లభించిందని, అదే తరహా లో మరల 22ఏ మెగా పరిష్కార మేళా కు ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. 22ఏ భూ సమస్యలపై మీ సేవా కేంద్రాల ద్వారా 150 వరకు విజ్ఞప్తులు అందాయని, మండల తహసీల్దార్లు వారికి అందిన విజ్ఞప్తులను కూడా పరిశీలించి మెగా మేళ సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

             జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, డి ఆర్ ఓ దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్డీఓ లు కిషోర్,రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, జిల్లా స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు అధికారి జి.వెంకట నాయుడు, తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.  

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post