పలాస – పూండి రైల్వే స్టేషన్ల మధ్య జరిగిన విషాద ఘటన


 పలాస – పూండి రైల్వే స్టేషన్ల మధ్య జరిగిన విషాద ఘటన.

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి: పలాస జీఆర్‌పీ ఎస్సై.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస:

పలాస రైల్వే జీఆర్‌పీ పరిధిలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస – పూండి రైల్వే స్టేషన్ల మధ్య ఎగువకు వెళ్లే (Up Line) రైలు మార్గంలో ఓ గుర్తుతెలియని మహిళ రైలు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది.

మృతురాలి వివరాలు:

 వయస్సు:సుమారు 50 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండవచ్చు.

శరీర వర్ణం/రూపం: సన్నని శరీరాకృతి, జుట్టు కొద్దిగా తెల్లబడి ఉంది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పలాస రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, గుర్తింపు కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రి (గవర్నమెంట్ హాస్పిటల్) మార్చురీకి తరలించారు.

ఈ మహిళకు సంబంధించిన ఎటువంటి వివరాలైనా తెలిసిన వారు లేదా బంధువులు ఎవరైనా ఉంటే వెంటనే సంప్రదించాలని పలాస జీఆర్‌పీ రైల్వే స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ (SI)ఎ. కోటేశ్వరరావు కోరారు.

వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 92475 85743.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post