కేంద్రీయ విద్యాలయం వద్ద మినీ స్టేడియం నిర్మించాలి.


 కేంద్రీయ విద్యాలయం వద్ద మినీ స్టేడియం నిర్మించాలి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.

 తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన టీడీపీ నేతలు.

పలాస :

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో క్రీడాకారుల సౌకర్యార్థం కేంద్రీయ విద్యాలయం సమీపంలో మినీ స్టేడియం నిర్మించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు పలాస తహసీల్దార్‌కు వారు వినతిపత్రం సమర్పించారు. గతంలో కోల్ ఇండియా కంపెనీ సీఎస్ఆర్ (CSR) నిధులతో మినీ స్టేడియం నిర్మాణానికి సూదికొండ (హుద్‌హుద్ ఇళ్ల వద్ద) 1.5 ఎకరాల స్థలాన్ని కేటాయించారని నేతలు గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయం నిర్మిస్తున్న ప్రాంతానికి ఆనుకుని ఉన్న సుమారు 1.5 ఎకరాల స్థలం స్టేడియం నిర్మాణానికి ఎంతో అనువుగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. కేంద్రీయ విద్యాలయం పక్కనే క్రీడా మైదానం ఉండటం వల్ల అటు విద్యార్థులకు, ఇటు స్థానిక యువతకు శారీరక దృఢత్వానికి, క్రీడల్లో రాణించడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. పలాస పట్టణంలో సరైన మైదానం లేక క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు స్పందించి వెంటనే స్థల మార్పిడిపై నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు,స్థానిక యువత పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post