జొన్న రైతులకు బాసటగా పోరుబాట.



 జొన్న రైతులకు బాసటగా పోరుబాట.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.

మద్దతు ధర కోసం ప్రభుత్వంపై డాక్టర్‌ ధqర్మాన కృష్ణచైతన్య ఆగ్రహం.

పొలాకి:

రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కకపోవడంపై వైయస్సార్సీపీ యువ నాయకులు, పోలాకి జెడ్పీటీసీ డాక్టర్‌ ధర్మాన కృష్ణచైతన్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదేశాల మేరకు బుధవారం పొలాకి మండలం తలసముద్రం గ్రామంలో పర్యటించి జొన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దళారుల చేతిలో రైతులు మోసపోతూ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత జగనన్న ప్రభుత్వంలో జొన్న క్వింటాకు రూ.2100 వరకు ధర లభించేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కేవలం రూ.1600లకే కొనుగోలు జరుగుతోందని ధ్వజమెత్తారు.

రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించిన ఆయన, రైతులకు న్యాయమైన మద్దతు ధర లభించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ పర్యటనలో నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా, మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post