ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డుకు చేయూత.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.
రూ.4.03 లక్షల చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి.
శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా విశేష సేవలందించి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన పెద్దింటి శంకర్ రావుకు ఆర్థిక సహాయంగా రూ. 4.03 లక్షల చెక్కును జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సిబ్బంది అంతా స్వచ్ఛందంగా తమ ఒక్క రోజు డ్యూటీ అలవెన్సును విరాళంగా సమకూర్చడం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించగా ఆ చెక్కును ఎస్పీ చేతుల మీదుగా ఉద్యోగ విమరణ చేసిన హోంగార్డుకి అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శంకర్ రావు పోలీసు శాఖలో అంకితభావంతో, నిబద్ధతతో సేవలందించారని ప్రశంసించారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.హోంగార్డు సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఒక్క రోజు డ్యూటీ అలవెన్సును అందించడం అభినందనీయమని, ఇటువంటి చర్యలు పోలీసు కుటుంబంలో ఐకమత్యాన్ని పెంపొందించడమే కాకుండా, అవసరమైన సమయంలో పరస్పరం అండగా ఉండే భావనను బలపరుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
