ప్రెస్ నోట్ కీ, ప్రెస్ మీట్ కీ తేడా తెలియని మీకు రాజకీయాలు ఎందుకు..??
మీడియా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఉంది.
ఓ ప్రముఖ వ్యాపారవేత్త తన అనుకూల మీడియా ఎన్ టీవీ, సాక్షీ మీడియా తో కలిసి తనపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు.
ఇంచార్జీ కావాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి.
మీ వ్యాపారాలు ఏవో మీరు చూసుకోండి. నేను వ్యక్తిగతంగా మీ జోలికి ఎప్పుడు రాలేదు.
ఇకపై నా జోలికి వస్తే ఖబద్దార్.
తనపై అసత్య ప్రచారం చేయిస్తున్న వారిపై మీడియా సమావేశంలో హెచ్చరించిన రెడ్డి అప్పలనాయుడు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, మే 30:- మీ వ్యాపారాలు ఏవో మీరు చేసుకోండి. నేను వ్యక్తిగతంగా మీ జోలికి ఎప్పుడు రాలేదు. ఇకపై నా జోలికి వస్తే ఖబర్దార్ అంటూ తనపై అసత్య ప్రచారం చేయిస్తున్న ఏలూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త పై ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు మీడియా సమావేశంలో మండిపడ్డారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కొన్ని మీడియా ఛానల్స్ (ఎన్ టీవీ, సాక్షి న్యూస్) లో ఓ బడా బాబుతో కలిసి తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జర్నలిజానికి దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. మీడియా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఉందన్నారు. ప్రెస్ నోట్ కీ, ప్రెస్ మీట్ కీ తేడా తెలియని వారికి రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు. 2019లో జనసేన పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరు కూడా రాకుండా, ఈరోజు కావాలని పార్టీలోకి వచ్చి తనపై లేని పోనీ అబండాలు సృష్టించి, అసత్య ప్రచారాలు చేయించడం సమంజసం కాదన్నారు. ఓటమిలో ఉన్నప్పుడు ఒక్కడూ కూడా జనసేన పార్టీ వైపు చూసిన దాఖలాలు లేవన్నారు. ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. జనసేన పార్టీలోకి ఎవరొచ్చినా తాను స్వాగతిస్తానన్నారు. తద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. తాను 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నానని, సమాజం పట్ల రాజకీయం పట్ల తనకు విపరీతమైన ఆసక్తి ఉండటంతో ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. ఏలూరులోనూ అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొన్నాను. జనసేన పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు ఏలూరులో అనేక రకాల కార్యక్రమాలను చేపట్టాను. ఎల్లప్పుడూ కూడా యాక్టివ్గానే ఉంటాను. తనకు తెలిసిందల్లా ప్రజల్లో ఉండటం, ప్రజలకు పనిచేసి పెట్టడం, సమస్యల పట్ల అవగాహనతో మాట్లాడటం, ఆ సమస్యల్ని పరిష్కరించడం మాత్రమే తనకు తెలుసన్నారు. కానీ ఈ మధ్యన కొంతమంది వాణిజ్య సంస్థ నుండి వ్యాపారస్తులు ఏలూరు జనసేన పార్టీ ఇన్చార్జి కావాలనే తనపై లేనిపోని అభండాలు సృష్టిస్తూ, తన అనుకూల మీడియాతో అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీకు ఇన్చార్జి ఇచ్చిన, జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన తనకు ఇష్టమేనని, పార్టీపరంగా తాను కూడా స్వాగతిస్తానన్నారు. ఎవరికైనా ఇన్చార్జి కావాలంటే ముందుగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు పనిచేసి పెట్టాలి. ఎంతసేపు వ్యాపారాల మీద దృష్టే కాకుండా ప్రజలకు వాళ్ల సమస్యల్ని తీర్చగలగాలి. ప్రజల్లో ఉండాలి. ప్రజా సమస్యలన్నీ తీర్చాలి. ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలి. ఇలా చేస్తే ఏ పార్టీ అయినా తగినంత గుర్తింపు ఇస్తుందన్నారు. ఈ విధంగా ట్రై చేసుకోవాల్సింది పోయి, కొంత మీడియా వాళ్లని ప్రలోభాలకు గురిచేసి, వారికి ఆశ చూపించి, తననీ తాను ఏదో బలోపేతం చేసుకున్నట్టు రెడ్డి అప్పలనాయుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని, నెలకి, రెండు నెలలకి, కార్యకర్తలకు ఒకసారి అందుబాటులోకి వస్తారని, ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని మీడియా సమావేశంలో హెచ్చరించారు. అసత్య ప్రచారం చేయిస్తున్న వారికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఏలూరులో ఎక్కడికైనా వెళ్లి అడగండి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక కార్యక్రమాలతో, ప్రజల్లో ఉండే నాయకుడు రెడ్డి అప్పలనాయుడు అనే చెబుతారన్నారు. ప్రజలు తమ సమస్యల్ని జనసేన పార్టీ కార్యాలయానికి కానీ, తన ఇంటికి గాని వచ్చి విన్నవిస్తారని, ఆ సమస్యల్ని తాను వెంటే పరిష్కరిస్తారని అన్నారు. నేను మీకు తెలిపేది ఒక్కటే, మీకు చిత్తశుద్ధి ఉంటే జనసేన పార్టీ కోసం పని చేయండి. ఏ పార్టీ అయినా మీకు గుర్తింపు ఇస్తుంది. అంతేగాని మీడియాలో, సోషల్ మీడియాలో ఎడిటింగ్ చేయించడం, తప్పుడు కథనాలు రాయించడం వల్ల, మీరు ఏదైనా సాధించగలరా, తనకోసం గతంలో చాలామంది తప్పుడు విధానాలను అనుసరించి, తప్పుడు కేసులు పెట్టించి, అనేక రకాలుగా ప్రయత్నం చేసి విఫలమయ్యారని గుర్తు చేశారు. ఈ సందర్భంలో అనేకమంది రాజకీయంగా తమ ఉనికిని కోల్పోయారు. మీడియా కీ కూడా తెలియజేస్తున్నాను ఏమనగా ప్రభుత్వానికి నాలుగో మూల స్తంభం జర్నలిజం. వారు ఎప్పుడూ వాస్తవాలనే ప్రజలకు తెలియజేయాలి తప్ప అసత్య ప్రచారాలను కాదని, ఈవిధంగా భ్రష్టు పట్టించవద్దని సాక్షి మీడియా కు, ఎన్ టీవీ మీడియాను హెచ్చరించారు. మిమ్మల్ని ఈ విధంగా ఉసగొలిపే బడా నాయకుల్ని కూడా నిత్యం జనాల్లో ఉండమని సలహా ఇవ్వండి. వాళ్లను కూడా పార్టీకి సర్వీస్ చేసేలాగా ప్రోత్సహించండి. ఈ సందర్భంగా ఎడిటింగ్ గ్రాఫిక్ లకు స్వస్తిపలకాలని హెచ్చరించారు. మీడియా సమావేశంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు వీరంకిపండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశి నరేష్, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, కొండల ప్రసాద్,కూనిశెట్టి మురళీకృష్ణ, జనసేన రవి, పెరుమాళ్ళ జనార్దన్ రావు, 1 టౌన్ మహిళ కార్యదర్శి వెలగా గాయత్రీ పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
