మేడే వర్థిల్లాలి...సోషల్ నిజమే ఈదేశానికి మరో ప్రత్యామ్నాయం - జిల్లా కార్యదర్శి ఎ రవి .
సోషలిజమే దేశానికి మరో ప్రత్యామ్నాయం కార్మిక కర్షక చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టంగా అమలు చేయాలి.
మేడే స్ఫూర్తితో శ్రమజీవులకు అండగా ఉద్యమాలు పోరాటాలు
నిర్వహించాలి.
సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ రవి కార్మిక కర్షకులకు వ్యవసాయ కార్మికులకు పిలుపునిచ్చారు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
జంగారెడ్డిగూడెం మే 1 శుక్రవారం స్థానిక ఏలూరు రోడ్ లో గల పుచ్చలపల్లి సుందరయ్య నిలయంలో మేడే సందర్భంగా జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కన్వీనర్ పి సూర్యారావు అధ్యక్షతన జరగగా సిపిఎం పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి ఎ రవి ఎగరవేశారు. మేడే వర్థిల్లాలని. ప్రపంచ కార్మికులారా ఏకం కావాలి మార్క్సిజం లెనినిజం వర్ధిల్లాలని సిపిఎం జిందాబాద్ అని సోషల్ నిజమే ఈదేశానికి మరో ప్రత్యామ్నాయమని నినాదాలు చేశారు. అనంతరం ఈ మేడే కార్యక్రమాన్ని ఉద్దేశించి
ఏ రవి మాట్లాడుతూ అమెరికా చికాగో నగరంలో 150 సంవత్సరాల క్రితం జరిగిన కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాల్లో వేలాదిమంది ప్రాణాలు దార పోసి పోరాడిన ఫలితంగా కార్మిక కర్షకుల హక్కులు సాధించారని దాని ఫలితమే ఎర్రజెండా ఏర్పడి శ్రమజీవుల కు అండగా నిలబడిందని కొనియాడారు
భారతదేశంలో గద్దినెక్కిన బిజెపి ప్రభుత్వం దేశంలోని మత విద్వేషాలు రెచ్చగొట్టి కులం మతం పేరుతో మతోన్మాద
దాడులు సృష్టిస్తుందని ఈ దాడులను తిప్పుకొట్టేందుకు కార్మికులు కర్షకులు ఐక్యంగా పోరాటాలు ఉద్యమాలు నిర్వహించాలని కోరారు ఇప్పటికే బిజెపి ప్రభుత్వం రైతు మూడు వ్యతిరేక నల్ల చట్టాలు కార్మికులకు హాని కలిగించే నాలుగు లేబర్ కోడ్.లు వ్యవసాయ కార్మికులకు పోరాడి సాధించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి విబి గ్రాంజీ పేరుగా మార్పు చేసి చట్టాలన్నీ పథకాలుగా మార్చి కార్మిక కర్షక రైతులు కూలీలను రోడ్డున పడేశాయని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు
గతంలో ఎనిమిది గంటలు పని దినం ఉంటే ఇప్పుడు 12 గంటలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు జారీ చేశాయని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను బ్యాంకింగ్ ఎల్ఐసి రైల్వే రోడ్డులు విద్యుత్ బొగ్గు గనులు గ్యాస్ పెట్రోలియం తదితర నిధి నిక్షేపాలన్ని అంబానీ ఆధానీలకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అమ్ముడుపోయిందని
దుయ్యబట్టారు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఉక్కు అమ్మకానికి పెట్టిందని అమరావతి పేరుతో వేలాది ఎకరాల భూములు రైతుల నుండి లాక్కొని అమ్మకానికి పెడుతుందని గూగుల్ కంపెనీల పేరుతో లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకనే సోషలిజమే మరో ప్రత్యామ్నాయంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ఉద్యోగులు మహిళలు శ్రమజీవుల అందరి సమస్యలపై ముందుండి పోరాటాలు నిర్వహిస్తుందని భవిష్యత్తులో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు నిర్వహించి పేదలకు అండగా ఉంటుందని అప్పుడే శ్రమజీవుల పండగ మేడే కు ఇచ్చే ఘనమైన స్ఫూర్తి అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్కే మాబు సుభాని బి బాలరాజు జోడే సూర్యచంద్రరావు యాగంటి సీతా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎంజీవరత్నం సిహెచ్ మాణిక్యాలరావు ఏ రామచంద్రరావు వంగ గోపి జి ఎస్ నారాయణ బి నాని ఎం అశోక్ కుమార్ డి రాజు మరి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.
Add
.jpg)


