పలాస బస్ డిపోలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.




 పలాస బస్ డిపోలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.

 క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.

 ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో పలాస బస్ డిపోలో ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి శ్రీ శాసనపూరి మురళి గారు (డిస్ట్రిక్ట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ) గారి, ఆర్ధిక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది.

నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ఆర్వో వాటర్ ప్లాంట్‌ను గౌరవ శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారు తన చేతుల ప్రారంభించి ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ప్రోత్సహించబడతాయని తెలిపారు. ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

పలాస బస్ డిపోకు రోజువారీగా వచ్చే ప్రయాణికులు, సిబ్బంది ఈ ప్లాంట్ ద్వారా లబ్ధి పొందనున్నారని అధికారులు తెలిపారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి సహకరించిన మురళి గారిని ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో, CVAPu team members మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్టీసీ సిబ్బంది, స్థానిక నాయకులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post