రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బొబ్బిలి మరియు పార్వతీపురం రైల్వే స్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదంలో ఈరోజు ఒక మరణం సంభవించింది. మృతుడు బ్రాహ్మపూర్ కి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 45-50 సంవత్సరాలు. అతను తెల్లటి ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నల్లటి ప్యాంటు ధరించి ఉన్నాడు. అతని కుడి చేతిపై హిందీలో 'పంచనన్' అని పచ్చబొట్టు ఉంది. బ్రహ్మపూర్ నుండి సూరత్ వెళ్లే ఒక సూపర్ ఫాస్ట్ జనరల్ రైలు టిక్కెట్టు కూడా లభించింది. అతను ప్రయాణంలో ఉండగా నడుస్తున్న రైలు నుండి కింద పడిపోయి ఉండవచ్చు. మృతుని గుర్తింపునకు సంబంధించి ఇంకెలాంటి ఆధారాలు లభించలేదు. విజయనగరం జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని గుర్తింపు గురించి మీకు ఏమైనా సమాచారం తెలిస్తే దయచేసి తెలియజేయండి. ప్రభుత్వ రైల్వే పోలీస్ ఎస్ఐ, విజయనగరం జీఆర్పీఎస్ ఫోన్ నెం. 9247585742
