డుమ్మాకొట్టిన అధికారులు.




 డుమ్మాకొట్టిన అధికారులు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.

మండల ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి పలు శాఖలకు చెందిన అధికారులు డుమ్మాకొట్టిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లో చోటుచేసుకుంది.

ప్రతినెలా జరిగే సర్వసభ్య సమావేశం లాగే మే నెలకు సంబంధించిన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని పలాస మండల కార్యాలయంలో ఏర్పాటు చేయగా సుమారు 8 శాఖలకు సంబంధించిన అధికారులు డుమ్మాకొట్టడంతో ప్రతిపక్షపార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు.సమస్యలు పట్ల చర్చించేందుకు తాము సమావేశానికి హాజరైతే సంబంధిత శాఖాధికారులు గైర్హాజరయ్యారని సమస్యలు ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు.

ఇదే విషయంపై మీడియా పలాస ఎంపిడిఓ ను వివరణ అడిగితే గైర్హాజరు అయిన వారికి షోకాజ్ నోటీసులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ప్రతిపక్ష పార్టీ కి చెందిన ప్రజాప్రతినిధులు ఉంగ.సాయికృష్ణ,ఎంపిటిసి బమ్మిడి. దుర్యోదనరావు లు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వరివిత్తనాలు,ఎరువులు కు సంబంధించి రైతులనుండి ఇండెంట్ తీసుకుని కొరత లేకుండా సకాలంలో అందించామని, ఈప్రభుత్వం మాత్రం గతయేడాది విత్తనాలను,ఎరువులను అందించడంలో విఫలమైందని ఈ ఏడాదన్నా సకాలంలో కొరతలేకుండా అందిస్తారా లేదా అని అగ్రికల్చర్ అధికారిని నిలదీశారు.భూములు రీసర్వే ఇంకా పూర్తికాని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించగా, రానున్న ఖరీఫ్ సీజన్లో సకాలంలో రైతులకు విత్తనాలు,ఎరువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నట్లు పలాస మండల అగ్రికల్చర్ అధికారి పోలారావు తెలిపారు.

సాధారణ సర్వసభ్య సమావేశంలో పలుశాఖలకు సంబంధించిన ప్రభుత్వాధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post