ఘనంగా అల్లూరి వర్ధంతి.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.
దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్న మోడీ.
న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి మాధవరావు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన అల్లూరి అల్లూరి స్ఫూర్తితో సామ్రాజవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాంఅని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు అన్నారు. రవిఅస్తమించని బ్రిటిసామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా పలాస మండలం మామిడిపల్లి గ్రామంలో అల్లూరి విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించడం జరిగింది ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ జిల్లా కన్వీనర్ సారా జగన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాధవరావు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం అల్లూరి సీతారామరాజు విరోచకంగా పోరాడి 1924 మే 7వ తేదీన బ్రిటిష్ వారు చేతులొ హత్యకు గురయ్యారు ఆనాడు బ్రిటీష్ సామ్రాజవాదానికి భారతదేశం వలసగా మారితే నేడు అమెరికన్ సామ్రాజ్యవాదం కి భారత పాలకులు లొంగి పోయారు ట్రంపు ఏది చెబితే దానికి దేశ ప్రధాని మోదీ తల ఊపుతూ ట్రంప్ కు గులాఎం గిరి చేస్తున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని మోడీ తాకట్టు పెడుతున్నారు భారతీయ విద్యార్థులకు సంకెళ్లు వేసి తీసుకురావడం అత్యంత దారుణమైనది టారిఫ్ల పేరుతో మన దేశం పైన ఇష్టానుసారంగా సుంకలు పెంచి మన ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేటట్లు చేస్తున్నారు ఆయిల్ ఏ దేశం నుండి దిగుమతి చేసుకోవాలో ట్రంప్ చెప్తేనే మోడీ చేస్తున్నాడు ఎస్ ఐ ఆర్ పేరుతో లక్షల్లో ఓటర్లను తొలగించి ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడి భారతీయ ఎన్నికల వ్యవస్థను తన జేబు సంస్థగా మార్చుకున్నారు రాష్ట్రాల ఫెడరల్ హక్కులను పూర్తిగా దెబ్బతీస్తున్నారు అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న యుద్ధాల్లో భారతదేశాన్ని భాగస్వామ్యం చేయడానికి చూస్తున్నాడు ఇరాన్ పై జరుగుతున్న అత్యంత పాసవికమైన దాడిని ఖండించలేకపోవడం అన్యాయమైనది అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో సామ్రాజవాదానికి వ్యతిరేకంగా మోడీ అమెరికాకు లొంగుబాటు కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు బతక ల ఈ శ్వరమ్మ కార్యవర్గ సభ్యురాలు వంకల డిల్లేశ్వరి ఏఐకేఎంఎస్ నాయకులు వంకలపాపయ్య జెడే అప్పయ్య సార నూకయ్య పిడిఎం నాయకులు ఎం గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
