ఉద్దానంలో అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని పరిశీలించిన డాక్టర్ దుర్గా రావు.



 ఉద్దానంలో అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని పరిశీలించిన డాక్టర్ దుర్గా రావు.

 క్రైమ్ నైన్ మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.

                                                                                                           ఉద్దానం ప్రాంతంలో అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా కొబ్బరి మరియు జీడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నష్టాన్ని జనసేన పార్టీ పలాస నియోజాకవర్గం ఇంచార్జీ డాక్టర్ వేగులాడ దుర్గా రావు , పుచ్చ భీమా రావు, దున్న పెంట రావు,డిల్లీ రావు, కీలు సునీల్ వర్మ , దున్న అనిల్, తామాడ పాపారావు ఇతర నేతలు, రైతుల తో కలిసి అమలపాడు , రెయ్యిపాడు, పెద్దమురహరి పురం, పంచాయతీలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్గా రావు మాట్లాడుతూ ఈదురు గాలులు, అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని రైతులకు భరోసా ఇచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా, సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపి, తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post