ఉంగుటూరుMLA పట్సమట్ల ధర్మరాజు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన రెడ్డి అప్పలనాయుడు.
MLA పట్సమట్ల ధర్మరాజు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన APSRTC విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
నారాయణపురం, మే 21:- ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పట్సమట్ల ధర్మరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజాసేవను జీవిత లక్ష్యంగా చేసుకున్న పట్సమట్ల ధర్మరాజు గారు దీర్ఘాయుష్షుమంతులై ఇంకా ఎన్నో సంవత్సరాలు, ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. రాజకీయ రంగంలోకి వచ్చిన రోజు నుంచి, ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నారని, ముఖ్యంగా ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధి పనులు, ప్రజలకు అండగా నిలవడంలో ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శాసనసభలోను, వెలుపల ప్రజా సమస్యలను ధైర్యంగా ప్రతిపాదించిన, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, సామాజిక సౌహార్ద్రాన్ని కాపాడుకోవడం, అభివృద్ధి పనులకు పునాదులు వేయడం వంటి అంశాల్లో చేసిన కృషి ప్రశంసనీయం అని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ధర్మరాజు గారి నాయకత్వం మరింత బలపడాలని ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు మాత్రమే కాకుండా, మొత్తం రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కూడా అభిప్రాయపడ్డారు. ప్రజలకు సత్యనిష్టతో పనిచేసే నేతలకు చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. పట్సమట్ల ధర్మరాజు గారు అలాంటి ప్రజా నాయకుడు. ఆయనకు పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
