గ్రామ స్థాయిలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన ఏలూరు జేసీ.
దెందులూరు మండలం గుడిగుంట గ్రామంలో "వన్ మంత్, వన్ విలేజ్, 4విజిట్స్" కార్యక్రమంలో పాల్గొన జేసీ డా.యం.జె. అభిషేక్ గౌడ.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, మే, 21 : మండలంలోని ఒక గ్రామాన్ని ప్రతీ నెలా సందర్శించి నెలరోజుల్లో ఆ గ్రామంలో రెవిన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. "వన్ మంత్, వన్ విలేజ్, 4విజిట్స్" కార్యక్రమంలో భాగంగా గురువారం దెందులూరు మండలం గుడిగుంట గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జేసీ అభిషేక్ గౌడ పాల్గొని ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ "వన్ మంత్, వన్ విలేజ్, 4విజిట్స్" కార్యక్రమం ద్వారా రెవిన్యూ అధికారులు వారి పరిధిలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని, ఆ గ్రామంలో నెలలో ప్రతీ గురువారం ప్రజల నుండి రెవిన్యూ సమస్యలపై విజ్ఞప్తులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. నెలలోగా ఆ గ్రామంలో ఎటువంటి రెవిన్యూ సమస్యలు పెండింగ్ లో లేకుండా చూడాలన్నారు. ప్రజలకు, రైతులకు రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వం "వన్ మంత్, వన్ విలేజ్, 4 విజిట్స్" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రధానంగా భూవివాదాలు, పట్టాదారు పాసు పుస్తకాలు, భూ రికార్డులు సవరణ, తదితర ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామంలోనే స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామ ప్రజలు, రైతులు కార్యాలయాలు చుట్టూ తిరిగే అవసరం లేకుండా, సమస్యలు శాశ్వత పరిష్కారం చూపడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు రెవెన్యూ అధికార్లు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించాలని జేసీ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రజల నుండి సిబ్బంది ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం చేసే విధానాన్ని జేసీ పరిశీలించారు. తహసీల్దార్ సుమతి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
