క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, మే 16 : చిన్నపిల్లల్లో కనిపించే థలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి రక్త సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్య విధానమైన బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ యూనిట్ సీనియర్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు, హెమటో ఆంకాలజిస్ట్ డా. అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం హోటల్ గ్రాండ్ ఆర్యాలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రంగంలో విశేష పురోగతి సాధించామన్నారు. ఇప్పటివరకు 450 కు పైగా విజయవంతమైన బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. సికిల్ సెల్ & థలసేమియా, వంటి వ్యాధులు పిల్లల ఎదుగుదలకు తీవ్ర ప్రభావం చూపుతాయని, అయితే సరైన సమయంలో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే పిల్లలు సాధారణ జీవితాన్ని గడపగలరని ఈ సందర్భంగా వివరించారు.
ప్రస్తుతం బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ మరింత సురక్షితంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. కుటుంబ సభ్యుల్లో సరిపోయే డోనర్ లభిస్తే చికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు.
ప్రజలకు అందుబాటులో వైద్యులు...
అలాగే యశోద హాస్పిటల్స్‌లో లభ్యమయ్యే అధునాతన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం ఏలూరులో, అలాగే రెండవ బుధవారం కాకినాడ మరియు రాజమండ్రిలో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
వ్యాధుల పట్ల అవగాహన కలిగివుండాలి...
రక్తహీనత, తరచూ జ్వరం, బలహీనత వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ ఇటువంటి వ్యాధుల పట్ల అవగాహన కలిగివుండాలన్నారు.
ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాల వీరభద్రం, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పి. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
.jpg)