అభివృద్ధి సుందరీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర అభివృద్ధి, సుందరీకరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు కార్పొరేషన్ ప్రత్యేక అధికారి .పి.రాజాబాబు స్పష్టం చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఒంగోలు పురపాలక సంఘం ఏర్పడి 150 ఏళ్లు పూర్తి కాబోతున్న దృష్ట్యా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల పురగతిపై సందర్భంగా ఆయన ఆరా తీశారు.
కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఆయా కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా వారికి మరింత అవగాహన కల్పించాలన్నారు.
పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ప్రజల ప్రవర్తనలో మరింత సానుకూల మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు.
నగరంలో అవసరమైన కొత్త టాయిలెట్లు నిర్మించడంతో పాటు మరమ్మతులు అవసరమైన వాటికి తక్షణమే చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
చిరు వ్యాపారాల కోసం ప్రత్యేక వెండింగ్, పార్కింగ్ ప్రాంతాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.
ఈ 150 ఏళ్ల ఉత్సవాలను ప్రతిబింబించేలా గాంధీ పార్కులో ప్రతివారం వివిధ ఇతివృత్తాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలన్నారు.
నగరంలో సందడి నెలకొనేలా వివిధ ప్రాంతాలలో పెద్దపెద్ద బెలూన్లు ఎగురవేయాలని చెప్పారు. ఈ వేడుకలను తెలియజేసేలా ప్రత్యేక లోగోను కూడా రూపొందించాలన్నారు.
ఈ సమావేశంలో కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, ఇంజనీరింగ్ అధికారులు, శానిటేషన్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
