నేరడి బ్యారేజీ ప్రతిపాదిత నిర్మాణ స్థలాన్ని సందర్శించిన డాక్టర్ దుర్గారావు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని. వంశధార నదిపై ప్రతిష్టాత్మకమైన నేరడి బ్యారేజీ నిర్మాణానికి దశాబ్దాల తర్వాత అడ్డంకులు తొలగి, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ (గెజిట్ నోటిఫికేషన్) లభించిందని, దశాబ్దాల కళ నెరవేర్చన సందర్భంగా వంశధార నదిపై నిర్మించతలపెట్టిన ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని పలాస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ దుర్గారావు , నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు దువ్వాడ వంశీకృష్ణ చౌదరి, నందిగామ ధర్మారావు, కీలు సునీల్ వర్మ,, ఈరోతు రామ్ , మెట్ట దుర్గాప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం అవుతుందని, దశాబ్దాల రైతుల కల సాకారమవుతుందన్నారు. ఆంధ్రా, ఒడిశాల మధ్య నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం గత ఏడు దశాబ్దాలుగా ముఖ్యమంత్రుల స్థాయిలో ఎన్నో దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే ట్రిబ్యునల్‌పై అవసరమైన న్యాయవాదులను పెట్టి సమస్య వివరించి విజయం సాధించామన్నారు. కేంద్రం ఆమోదం తెలపడం హర్షించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. భామిని మండలం నేరడి దగ్గర బ్యారేజీ నిర్మాణానికి 1961లో తొలి అడుగు పడిందిని, అప్పటి నుంచి కోర్టు చిక్కులతో ఈ ప్రాజెక్టు పెండింగ్‌లోనే ఉందిని,ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నేరడి బ్యారేజీ అంశం గురించి కేంద్రంతో మాట్లాడారని, ఢిల్లీ వెళ్లిన సమయంలో కేంద్ర జలశక్తిమంత్రి, ఆ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారని తెలిపారు. సుదీర్ఘ పోరాటం ఫలించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు . 1987 లో నాటి పార్లమెంటు సభ్యులు హనుమంతు అప్పయ్య దొర. పార్లమెంట్ లో చేసిన సుదీర్ఘ ప్రసంగంతో ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అన్నారు. నేడు ఆయన ఆశయం కూడా నెరవేరిందని, ఇప్పుడు నేరడి బ్యారేజి పనులు చేపట్టి పూర్తిచేస్తే తొలిదశలో లక్షా 48వేల ఎకరాలకు నీళ్లు అందించొచ్చని, రెండో దశలో మరో లక్షా 7వేల 280 ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చంటున్నారు. సాగునీరుతో పాటుగా తాగునీటి సమస్య కూడా తీరుతుందన్నారు. జిల్లా వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు అందించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . సరైన కార్యాచరణతో పరిష్కారం దిశగా నడిపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శ్రీకాకుళం రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.


