అర్హత కలిగిన ప్రతి పేదవాడికి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది -ఎమ్మెల్యే కూన రవికుమార్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.
నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 67 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన --ఎమ్మెల్యే కూన రవికుమార్.
వైసిపి ప్రభుత్వ కాలంలో అర్హత కలిగి ఉన్నప్పటికీ తెదేపా మద్దతు దారులు అనే కారణంతో కలివరం పంచాయతీకి చెందిన 20 మందికి పెన్షన్లు నిలిపివేశారు అప్పుడు నిలిపివేసిన పెన్షన్లను తిరిగి మంజూరు చేపించి ఆ పేద కుటుంబాలకు అందజేసిన ఎమ్మెల్యే రవికుమార్.
👉ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో కొత్తగా మంజూరైన 67 స్పౌస్ మరియు రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ హాజరై లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందజేశారు.
👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఆధారంలేని కుటుంబాలకు పెన్షన్‌లు ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తాయని అన్నారు.
👉కొత్తగా మంజూరైన 67 స్పౌస్ మరియు రోల్‌బ్యాక్ పెన్షన్లు లబ్ధిదారులకు అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
👉పెన్షన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓలు, మున్సిపల్ అధికారులు,ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

