ఘనంగా ప్రారంభం ఐన జిల్లా స్థాయి టి20 క్రికెట్ టోర్నమెంట్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.
యువత చదువుతోపాటు క్రీడలు పైన దృష్టి పెట్టాలి.... ఎమ్మెల్యే కూన రవికుమార్.
👉ఆముదాలవలస పట్టణంలోని జూనియర్ కాలేజీ మైదానంలో ఎమ్మెల్యే కప్ టీ20 జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించిన ఆముదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్.
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన పెరగడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కూన రవికుమార్ క్రీడాకారులతో పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్యాటింగ్ చేసి, తొలి బంతిని ఆడి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుండి పాల్గొన్న జట్లకు స్వాగతం పలుకుతూ క్రీడలను ఆరోగ్యకరమైన పోటీ వేదికగా భావించాలని సూచించారు.
యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ప్రభుత్వం కూడా క్రీడా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడం కోసం ఇలాంటి టోర్నమెంట్‌లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు మాజీ మున్సిపల్ చైర్మన్ తమ్మినేని గీతా విద్యాసాగర్ గారు, జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్ గారు, టిడిపి ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత గారు,స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
👉ఆముదాలవలస పట్టణంలోని జూనియర్ కాలేజీ మైదానంలో ఎమ్మెల్యే కప్ టీ20 జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించిన ఆముదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు.
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన పెరగడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు క్రీడాకారులతో పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్యాటింగ్ చేసి, తొలి బంతిని ఆడి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుండి పాల్గొన్న జట్లకు స్వాగతం పలుకుతూ క్రీడలను ఆరోగ్యకరమైన పోటీ వేదికగా భావించాలని సూచించారు.
యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం కూడా క్రీడా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడం కోసం ఇలాంటి టోర్నమెంట్‌లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు మాజీ మున్సిపల్ చైర్మన్ తమ్మినేని గీతా విద్యాసాగర్ గారు, జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్ గారు, టిడిపి ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత గారు,స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

.jpg)
