ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలోసాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ పశ్చిమ ఆసియా దేశాలలో యుద్ధ ప్రభావంతో పొదుపు చర్యల్లో భాగంగా డిజిటల్ మహానాడుకు టీడీపీ శ్రీకారం చుట్టింది.
నెల్లూరులో జరగాల్సిన మహానాడును రద్దుచేసి క్లస్టర్ స్థాయిలో డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ఉన్న 1875 క్లస్టర్లలో అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహిస్తామని తెలిపారు.
1875 క్లస్టర్లలో ఎల్ఈడి స్క్రీన్ లపై మహానాడు కార్యక్రమం జరుగుతాయన్నారు మహానాడుకు హాజరయ్యే కార్యకర్తలకు ఆహారం, త్రాగునీటి వసతి కల్పిస్తాము మండల, నియోజకవర్గస్థాయిలలో రెండు రోజులు నిర్వహించే కార్యక్రమం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సారధ్యంలో నిర్వహిస్తాము
లైవ్ టెలికాస్ట్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాయకులు, క్లస్టర్ యూనిట్ ఇన్చార్జులు, నియోజకవర్గ ఇన్చార్జిలు పాల్గొంటారు
మొదటి రోజు ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళి, జెండా ఆవిష్కరణ, సీనియర్ నాయకులకు సన్మానం మండల, నియోజకవర్గ స్థాయిలో చేసిన తీర్మానాలను జాతీయ పార్టీ కార్యాలయానికిపంపించాలన్నారు.
డిజిటల్ మహానాడును విజయవంతం చేస్తామన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
