పలాస లో విషసర్పాలు హల్ చల్.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీకి చెందిన పలు ప్రాంతాల్లో విష సర్పాల బెడద తీవ్రంగా ఉంది. సూదికొండ ప్రాంతంలో సోమవారం నాడు సాయంత్రం బుడ్డ. జంగమయ్య అనే అతని ఇంట్లోకి నాగుపాము చొరబడి హల్ చల్ చేసింది.
దినసరి కూలీగా పనులు నిమిత్తం బయటకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకుని తలుపులు తీసి లోపలికి వెళ్లగా గదిలో పడగవిప్పి బుసలు కొడుతూ ఉన్న సుమారు 6 అడుగుల నాగుపాము ను చూసి హడలిపోయారు.
అలాగే రోటరీనగర్ లో ఓ ఇంటిముందు ఉన్న పూలచెట్టు వద్ద ఓ మహిళ పూలు కోసేందుకు ప్రయత్నిస్తుండగా చెట్టుపై పడగ విప్పి బుసలుకొడుతున్న నాగరాజును చూసి పరుగులు తీసింది.
రెండుచోట్లా గంటలు పాటు నాగుపాము అక్కడే తిష్ఠవేయడంతో విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకుని నాగుపాముని చూసి బెంబేలెత్తిపోయారు.
అనంతరం సమాచారమందుకున్న స్థానిక స్నేక్ కేచర్ చేరుకుని చాకచక్యంగా నాగుపాములను పట్టుకుని గోనె సంచిలో బంధించి దూరంగా అటవీప్రాంతంలో విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఏ క్షణాన ఎక్కడ ఎవరిని కాటేస్తాయోనని ప్రజలు హడలిపోతున్నారు.
రియల్ ఎస్టేట్ తోపాటు అభివృద్ధి పేరుతో కొండలు,గుట్టలు,ఆటవీప్రాంతాలు సహితం పెద్దఎత్తున త్రవ్వకాలు జరుపుతున్న కారణంగా పాముల ఆవాసాలు విధ్వంసానికి గురౌతుండడంతోనే విషసర్పాలు జనావాసాల్లోకి చేరుతున్నట్లు పలువురు భావిస్తున్నారు.
ఆటవీశాఖాధికారులు టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటుచేసి స్నేక్ కేచర్లను అందుబాటులో ఉంచేవిధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
